Chandrababu: ఫెంగల్ తుఫాన్పై అధికారులతో సీఎం సమీక్ష...! 22 d ago
ఫెంగల్ తుఫాన్పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి..అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అన్నారు.